ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు: జాతీయ జెండా ఆవిష్కరించినచైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్.

Spread the love

గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ లతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. ఐక్యత అభివృద్ధి ప్రేరణనిస్తూ జాతీయ జెండా పండుగను జరుపుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *