రైతుల కోసంమరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ.

Spread the love

మార్కెట్ లో మౌలిక వసతుల కల్పనకై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ అన్నారు. పాత మరుగుదొడ్లు పూర్తిగా ధ్వంసం అవడంతో రైతులు వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని సోమవారం చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ లతో కలిసి మార్కెట్ లో రూ. 10 లక్షలతో నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో ఉన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని రైతులు కమిషన్ ఏజెంట్లు వినియోగదారులు ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించడానికి ఎల్లప్పుడు ముందు ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి వెంకటేష్ ముదిరాజ్ డైరెక్టర్లు శంకర్ పండు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *