కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గండిపేట మండలం 122 డివిజన్ కిస్మత్పురంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించి పెద్ద సంఖ్యలో పార్టీ చేరారు. మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నేత, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎం. వాసవి నవీన్ ముదిరాజ్, నవీన్ ముదిరాజ్, ఏ, రాములు యాదవ్, యేసయ్య, జావిద్ బేగ్, శశిధర్ రెడ్డి, మైనారిటీ నాయకులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు,కార్యకర్తలు దాదాపు 1000 మందికి పైగా పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. రైతు రుణమాఫీ, మహిళలకు ఆర్థిక భద్రత, యువతకు ఉద్యోగాలు వంటి కీలక హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. మాజీ మంత్రివర్యులుసబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ,బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో పాలనా లోపాలు, ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. శాసనమండలి మాజీ చైర్మన్స్వామి గౌడ్ మాట్లాడుతూ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రాంతం నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీవ్ర వివక్షకు గురైందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల పాలనలో రైతు బంధు, మిషన్ భగీరథ, కాళేశ్వరం, దళిత బంధు వంటి పథకాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, అభివృద్ధి నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.పటోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ,బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో కాంగ్రెస్‌లోకి వెళ్లి, ఇప్పుడు రెండు పార్టీల పేర్లు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఇది ప్రజల విశ్వాసానికి ద్రోహమని, రాజకీయ మోసమని విమర్శించారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెట్రో రైలు ప్రాజెక్టును రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆ నిర్ణయానికి కారణమైన ప్రకాశ్ గౌడ్‌కే పూర్తి ఘనత దక్కుతుందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రావులకోళ్ల నాగరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాముడు యాదవ్, మాట్లాడుతూ,తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కులు, అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, వెంకటేష్, రవికుమార్, పెంట యాదవ్, సుధాకర్ గౌడ్ , శాంతి కుమార్, శ్శాంతి నాయక్, మల్లీశ్వరి, జ్యోతి,మాధవి,మహేష్, ఉదయ్, చందు, చంద్రశేఖర్,శ్యాముల్, రాజ్ కుమార్, ఇంతియాజ్, ఇస్మాయిల్, తదితర పార్టీ నాయకులు శ్రేయోభిలాషులు వివిధ కాలనీల ప్రజలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పతనం మొదలైందిరాబోయే ఎన్నికల్లో బీ ఆర్ఎస్ గెలుపు ఖాయం సబితా.
