ఘనంగా శ్రీ గాయత్రీ ఇ-టెక్నోస్కూల్ వార్షికోత్సవ వేడుకలు.

Spread the love

విద్యారంగంలో శ్రీ గాయత్రీ ఇ-టెక్నోస్కూల్ అందిస్తోన్న సేవలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. దశాబ్ద కాలంగా ఎంతోమంది విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. అలాంటి వాళ్లే ప్రస్తుతం చాలామంది ఉన్నత స్థితిలో ఉన్నారని అభినందించారు. ఇకపైనా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని, గాయత్రి స్కూల్లో చదివిన విద్యార్థులు సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చే ప్రముఖులుగా ఎదగాలని ఆకాంక్షించారు, శ్రీ గాయత్రి ఇ-టెక్నోస్కూల్ 14వ యానివర్సి వేడుకలు తారామతి బారాదరిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు
ఈ ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరై చిన్నారుల ప్రతిభా పాటవాలను తిలకించి ఆశీర్వచనాలు అందజేశారు. ప్రతియేడూ మాదిరిగానే పాఠశాల వార్షికోత్సవాలు ఈసారి కూడా అందరినీ అలరించాయి.
ఈ యేడాది అన్ని రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు,
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే డ్యాన్స్, జాతీయ సమైక్యత, సమగ్రతను ప్రస్ఫుటించే ప్రదర్శనలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల పాఠశాల నిర్వాహకులు, యాజమాన్యం, టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది అందరూ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అంకితభావం కలిగిన అధ్యాపకుల పర్యవేక్షణలో సాగిన ఈ ఉత్సవంలో విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను అత్యున్నతంగా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి ఇ-టెక్నో స్కూల్
చైర్మన్ కొంపల్లి మధు సూధన్,
డైరెక్టర్లు సమియుద్దిన్.
సీఈవో సర్వేశ్వరరావు,
ప్రిన్సిపాల్ రచన, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి
మల్లేష్ ముదిరాజ్, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్, వేణు గౌడ్, రామకృష్ణారెడ్డి
అశోక్ యాదవ్,
విట్టల్ ఫార్మర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్, ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *