ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్-130వ ఎపిసోడ్ ‘ వీక్షించిన బిజెపి నాయకులు.

Spread the love

రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ సర్కిల్ కిస్మత్‌పూర్‌లోని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు భీమార్జున్ రెడ్డి నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. వీరేందర్ గౌడ్ హాజరై మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. మోడీ మాట్లాడుతూ రేపు మనం జనవరి 26న మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అదే రోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మన రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించే అవకాశాన్ని మనకు కలిగిస్తుందని చెప్పుకొచ్చారు అలాగే అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మనం పుట్టిన రోజులను ఎలాగైతే జరుపుకుంటామో అదేవిధంగా ఒక యువకుడు మొదటిసారిగా ఓటర్ గా మారినప్పుడు ఆ పరిసర ప్రాంతాల గ్రామం నగరం అంతా కలిసి వారిని అభినందించి స్వీట్లు పంపిణీ చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ , బండ్లగూడ బిజెపి అధ్యక్షులు మహేష్ , జిల్లా కార్యవర్గ సభ్యుడు నీరుడు శేఖర్ ముదిరాజ్,శ్రీధర్ రెడ్డి , నాగభూషం , నరేష్ మహాలింగం , పవన్ సాయి , సాయి రెడ్డి , ప్రవీణ్ గౌడ్ , గంగని అరుణ్ , లక్ష్మణ్ ముదిరాజ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *