చంపాపేట కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అకాల మరణం చెందగా..ఇవాళ ఉదయం కర్మాన్ ఘాట్ లోని వారి నివాసం వద్ద మధు సూధన్ రెడ్డి భౌతిక కాయానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. చిన్న వయసులోనే మధు సూధన్ రెడ్డి మన మధ్య నుండి దూరమవ్వడం తనను వ్యక్తిగతంగా కలిచివేస్తుందని,ఆయనతో అనుబంధం 30ఏళ్ల నాటిదని,తనకు సోదరుడులాంటివాడని ఆయనతో ఉన్న ఙ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. గొప్ప ప్రజానాయకుణ్ణి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,మనోధైర్యం చెప్పారు. భగవంతుడు మధు సూధన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని మంత్రి ప్రార్ధించారు.
చంపాపేట కార్పొరేటర్ వంగా మధు సూదన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
