మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఆహ్వానించిన ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు.

ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరం జనవరి 1నుండి మొదలయ్యే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నీ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కలిసి శనివారం ఆహ్వానం అందజేశారు.జనవరి 1నుండి ఫిబ్రవరి 15వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు మంత్రితో వారు పేర్కొన్నారు.

Read More

నాగర్ కర్నూల్ లో కవిత.

నాగర్ కర్నూల్ పట్టణంలోని విద్యానగర్ లో ప్రముఖ సాహితీవేత్త దివంగత కపిలవాయి లింగమూర్తి నివాసాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా ఆయన రచనలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు.. లింగమూర్తి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన రచనలు సహా ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Read More

పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు:డీజీపీ శివధర్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా హెచ్చరించారు. సివిల్ వివాదాల్లో (కుటుంబ సంబంధాలు, ఆస్తి విభజన, భూమి వివాదాలు మొదలైనవి) పోలీసులు తలదూర్చకూడదని, అటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. “గీత దాటితే వేటు తప్పదు” అనే సూక్తి గుర్తుచేస్తూ, పోలీసు స్టేషన్లను పంచాయితీ అడ్డాలుగా మార్చి సివిల్ తగాదాలు సెటిల్ చేస్తే ఎవరైనా (హోం గార్డు నుంచి ఐపీఎస్ అధికారి…

Read More

తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొంది.

రేవంత్ రెడ్డి మాటలు చూసి చిన్న పిల్లలు భయపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూసి తెలంగాణ ప్రజలు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యం. కేసీఆర్ హయంలోపల్లె, పల్లె పరిశుభ్రతతో కనిపించేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పల్లెలు దివాళా తీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. గెలిచిన స్థానాలన్నీ మావే అని రేవంత్…

Read More

మెడికల్ అండ్ హెల్త్ వింగ్ – తెలంగాణ టీపీసీసీ తొలి సమావేశం.

మెడికల్ అండ్ హెల్త్ వింగ్ – తెలంగాణ టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశం సందర్భంగా స్టేట్ చైర్మన్ డాక్టర్ యం. రాజీవ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మానం తనకు అపారమైన ఆనందం, గౌరవాన్ని కలిగించిందని డా. యం. రాజీవ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా తనను సన్మానించిన వైస్ చైర్మన్ డా. అభిషేక్‌తో పాటు సమస్త టీమ్ సభ్యులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ప్రాణమే అన్నిటికంటే విలువైనదని పేర్కొన్న డా. రాజీవ్, ప్రజారోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని…

Read More

డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ప్రారంభం.

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి తండ్రి జ్ఞాపకార్థం తో నిర్మించిన డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజాహరుద్దీన్స్థానిక బీసీ బాలికల వసతి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన డిజిటల్ సెంటర్ ను వారు పరిశీలించారు. అదేవిధంగా పిల్లలకు ప్లే గ్రౌండ్, ఆర్వో వాటర్ ప్లాంట్ ను కూడా మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. .. విద్యార్థులకు నాణ్యమైన…

Read More

తెలంగాణా లైఫ్ సైన్సెస్ కొత్త డైరెక్టర్ & సిఇఓగా సర్వేశ్ సింగ్.

లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణా నూతన ఆవిష్కరణల్లో మరింత వేగంగా దూసుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణా బయోసైన్సెస్ డైరెక్టర్, సిఇఓగా బాధ్యతలు స్వీకరించిన సర్వేశ్ సింగ్ సోమవారం నాడు సచివాలయంలో తనను కలిసిన సందర్బంగా ఆయన అభినందనలు తెలిపారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తనకున్న 22 సంవత్సరాల అపార అనుభవాన్ని రాష్ట్రంలో మంచి ఎకో సిస్టంను నెలకొల్పేందుకు వినియోగించాలని సూచించారు. ప్రపంచానికి…

Read More