మెడికల్ అండ్ హెల్త్ వింగ్ – తెలంగాణ టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశం సందర్భంగా స్టేట్ చైర్మన్ డాక్టర్ యం. రాజీవ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మానం తనకు అపారమైన ఆనందం, గౌరవాన్ని కలిగించిందని డా. యం. రాజీవ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తనను సన్మానించిన వైస్ చైర్మన్ డా. అభిషేక్‌తో పాటు సమస్త టీమ్ సభ్యులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రాణమే అన్నిటికంటే విలువైనదని పేర్కొన్న డా. రాజీవ్, ప్రజారోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. “అర్హత కలిగిన వారిచే నాణ్యమైన వైద్యం – ఇది ప్రజలందరి హక్కు” అనే మోటోను సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించడం ఎంతో ప్రాధాన్యత కలిగిన నిర్ణయమని అన్నారు. ఈ మోటోను ఆమోదించినందుకు సమావేశానికి హాజరైన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ లక్ష్య సాధన కోసం తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నాయకత్వంలో మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజారోగ్యమే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
అదేవిధంగా, మిగిలిన రాష్ట్ర, జిల్లా కమిటీలను త్వరలో ప్రకటించి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సముచిత అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ వింగ్ పని చేస్తుందని ఆయన అన్నారు.
మెడికల్ అండ్ హెల్త్ వింగ్ – తెలంగాణ టీపీసీసీ తొలి సమావేశం.
