తాగునీటి సరఫరాపై మంత్రి సీతక్క సమీక్ష:.

రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఈఎన్సీ కృపాకర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.సమస్యలు వచ్చాక స్పందించడం కంటే, రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పంపు సెట్లు పాడైతే వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు.రాబోయే వేసవిలో ఎక్కడా నీటి కొరత…

Read More

మేడారం జాతరకు ఆహ్వానం.

సిపిఐ, బిజెపి, ఎంఐఎం శాసనసభా పక్ష నేతలకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రి సీతక్కఆలయ సాంప్రదాయాల ప్రకారం బంగారం, తల్లుల కుంకుమ పసుపు అంద చేసి ఆహ్వానించిన మంత్రి సీతక్కమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని కలిసి మహా మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రి సీతక్కమంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఉన్నతాధికారులు.. ప్రతి ఒక్కరిని కలుస్తూ మేడల మహా జాతరకు ఆహ్వానిస్తున్న మంత్రి సీతక్క.

Read More

మంత్రి నారా లోకేష్ ను కలిసిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక.

మంగళగిరికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక కుటుంబ సభ్యులతో సహా ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఇటీవల ఇస్తాంబుల్ లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పపర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో బొల్లినేని చంద్రిక +84 కేజీ సీనియర్ విభాగంలో ఓవరాల్ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా బొల్లినేని చంద్రికను మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్ లో అన్ని విధాల అండగా ఉంటామని…

Read More

ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యవేక్షణ.

గోషామహల్‌లో నిర్మిస్తున్న నూతన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనుల పురోగతి, రోడ్డు మౌలిక సదుపాయాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు సోమవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి, సంబంధిత అన్ని…

Read More

అసెంబ్లీలో మేడారం సందడి.

తెలంగాణ శాసనసభలో మేడారం మహా జాతర సందడి నెలకొంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, దేవాదాయ ధర్మాదాయ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు పలువురు మంత్రులకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా మేడారం…

Read More

చైనా మాంజా.. పక్కా డేంజర్ భాయ్!

నిషేధిత చైనా మాంజా వాడకంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తనదైన శైలిలో స్పందించారు. సంక్రాంతి పండగ వేళ పతంగుల కోసం చైనా మాంజా వాడొద్దంటూ హైదరాబాదీ యాసలో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా చైనా వస్తువుల గురించి మన దగ్గర ఒక సామెత ఉంది. ‘‘చలే తో చాంద్‌ తక్‌.. వర్నా షామ్‌ తక్‌’’ (ఉంటే చంద్రుడి దాకా.. లేదంటే సాయంత్రం దాకా) అని సరదాగా అనుకుంటాం. ఇదే…

Read More

ఉచిత వైద్య శిబిరం.

నిజాంపేట మండలం నగరం తాండ మరియు నగరం గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ గ ఉచిత హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తగు సూచనలు సలహాలు అందించి తగిన టాబ్లెట్స్ ఉచితంగా అందించారు మా తండాకు వచ్చి మా ఆరోగ్య సమస్యలు తెలుసుకొని మందులు ఇచ్చినందుకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి గొప్ప…

Read More

వికారాబాద్‌లో ముమ్మరంగా వీధి కుక్కల నియంత్రణ చర్యలు.

వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలో వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో తిరుగుతున్న కుక్కలను పట్టుకొని, వాటికి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.పట్టణంలో ఇప్పటి వరకు మొత్తం 630 వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. గత నెల 19వ తేదీన ఒక్కరోజే 35 కుక్కలను (15 మగ, 20 ఆడ) పట్టుకొని ప్రత్యేక కేంద్రానికి తరలించారు.పట్టుబడిన కుక్కలలో ఈ నెల 2వ తేదీన 8 కుక్కలకు…

Read More

11న ‘పుర’ ఎన్నికల షెడ్యూల్!

రాష్ట్రంలో అనుకున్నదాని కంటే ముందుగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 125 పురపాలక సంఘాల ఎన్నికలకు ఈ నెల 11నే షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని ఆ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఓటర్ల జాబితాలు సహా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సర్వం సిద్ధం చేసుకున్నట్టు వెల్లడిస్తున్నాయి. సంక్రాంతి పండుగ తరువాత మున్సిపల్ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని, ఫిబ్రవరి రెండో వారంలోపు ఎన్నికలు పూర్తవుతాయని తొలుత ప్రచారం జరిగింది. కానీ…

Read More

హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలి : పట్నం మహేందర్ రెడ్డి.

ప్రభుత్వం హోం గార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సాగినశాసన పరిషత్తు 25 వ సమావేశాల మూడవ రోజు ప్రశ్నోత్తరాల సమయం తరువాత సాగిన ప్రత్యేక ప్రస్తావన లో ఆయన హోం గార్డుల సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 14,000 మంది హోంగార్డులు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారని చెప్పారు. పోలీస్ శాఖ లోని ఉన్నతాధికారులు మొదలు కానిస్టేబుల్…

Read More