వికారాబాద్‌లో ముమ్మరంగా వీధి కుక్కల నియంత్రణ చర్యలు.

Spread the love

వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలో వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో తిరుగుతున్న కుక్కలను పట్టుకొని, వాటికి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.పట్టణంలో ఇప్పటి వరకు మొత్తం 630 వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. గత నెల 19వ తేదీన ఒక్కరోజే 35 కుక్కలను (15 మగ, 20 ఆడ) పట్టుకొని ప్రత్యేక కేంద్రానికి తరలించారు.పట్టుబడిన కుక్కలలో ఈ నెల 2వ తేదీన 8 కుక్కలకు పశువైద్యుల ఆధ్వర్యంలో విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించారు. మిగిలిన వాటిలో మరో 27 కుక్కలకు త్వరలోనే ఆపరేషన్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సంరక్షణ కేంద్రంలో ఉన్న కుక్కలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోజుకు రెండు సార్లు ఆహారం అందిస్తూ వాటి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *