వేడుకగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు సంబరాలు.

Spread the love

నంద్యాల జిల్లా ప్రజల గొంతుకై, భారత పార్లమెంట్ లో జిల్లా ప్రజల సమస్యలు ప్రస్థావిస్తూ, జిల్లా అభివృద్ధిలో కీలక భాగస్వామికగా మారి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా నాయకురాలుగా, డైనమిక్ లీడర్గా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నిలిచారని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి అన్నారు.

ఆదివారం నంద్యాల బొమ్మలసత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి మెగా రక్తదాన శిబిరంను, భారీ కేక్ కట్ చేసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జన్మదిన వేడుకలు ప్రారంభించారు.
ఈ సందర్బంగా తులసి రెడ్డి, టీడీపీ బి సి సెల్ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, శ్రీశైల దేవస్థానం పాలక మండలి డైరెక్టర్ జిల్లెల్ల శ్రీదేవి, జనసేన నంద్యాల పార్లమెంట్ నాయకులు భవనాసి వాసు, గోస్పాడు మండల టీడీపీ కన్వీనర్ కాటంరెడ్డి తులసీశ్వరరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ద్వారం వీరారెడ్డి, బాలీశ్వరరెడ్డి, యాల్లూరు వెంకటరెడ్డి, మహానంది మండల టీడీపీ నాయకులు నన్నపనేని నాగేశ్వరావు (పెద్ద బాబు), పాణ్యం మండల టీడీపీ నాయకులు గోరుకల్లు ఎరుకలయ్య, శివారెడ్డి,, నంద్యాల నాయకులు కౌన్సిలర్లు తబరేస్, జహున్ బీ, మాజీ కౌన్సిలర్లు మంచాల విజయభాస్కర్ రెడ్డి, మధుసాయి, గణపం పుల్లారెడ్డి, అజయ్, మనోజ్ రాయల్ తదితరులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సేవలు కొనియాడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *