ప్రభుత్వం హోం గార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సాగిన
శాసన పరిషత్తు 25 వ సమావేశాల మూడవ రోజు ప్రశ్నోత్తరాల సమయం తరువాత సాగిన ప్రత్యేక ప్రస్తావన లో ఆయన హోం గార్డుల సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 14,000 మంది హోంగార్డులు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారని చెప్పారు. పోలీస్ శాఖ లోని ఉన్నతాధికారులు మొదలు కానిస్టేబుల్ వరకు ఉద్యోగుల తో కలిసి వారు అనునిత్యం శాంతి భద్రతల కోసం తపిస్తూ విధులను నిర్వహిస్తుంటారని చెప్పారు. అసలు పోలిసు శాఖ లో ముందుండి పని చేసేది హోంగార్డు లేదని ఆయన అన్నారు. ఇలా కష్టపడే హోంగార్డులు వేతనాలు, ఇతర ప్రభుత్వ ద్వారా అందే సదుపాయాల పొందడం కోసం కష్టాల పాలవుతున్నారని ఆయన చెప్పారు. చివరకు వారి కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ పరిస్థితిలో సైతం వారు కష్టపడుతుంటే పట్టించుకునే వారు కరువై నట్లు వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారికి ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ద్వారా కోరుతున్నట్లు ఆయన వివరించారు. ఇందుకు స్పందించిన రాష్ట్ర మంత్రి హజరుద్దీన్ హోం గార్డుల సమస్యలను పరిష్కరిస్తామని అందుకు సీఎంకు నివేదిస్తానని హామీ ఇచ్చారు.
హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలి : పట్నం మహేందర్ రెడ్డి.
