అసెంబ్లీలో మేడారం సందడి.

తెలంగాణ శాసనసభలో మేడారం మహా జాతర సందడి నెలకొంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, దేవాదాయ ధర్మాదాయ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు పలువురు మంత్రులకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా మేడారం…

Read More

చైనా మాంజా.. పక్కా డేంజర్ భాయ్!

నిషేధిత చైనా మాంజా వాడకంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తనదైన శైలిలో స్పందించారు. సంక్రాంతి పండగ వేళ పతంగుల కోసం చైనా మాంజా వాడొద్దంటూ హైదరాబాదీ యాసలో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా చైనా వస్తువుల గురించి మన దగ్గర ఒక సామెత ఉంది. ‘‘చలే తో చాంద్‌ తక్‌.. వర్నా షామ్‌ తక్‌’’ (ఉంటే చంద్రుడి దాకా.. లేదంటే సాయంత్రం దాకా) అని సరదాగా అనుకుంటాం. ఇదే…

Read More

వేడుకగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు సంబరాలు.

నంద్యాల జిల్లా ప్రజల గొంతుకై, భారత పార్లమెంట్ లో జిల్లా ప్రజల సమస్యలు ప్రస్థావిస్తూ, జిల్లా అభివృద్ధిలో కీలక భాగస్వామికగా మారి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా నాయకురాలుగా, డైనమిక్ లీడర్గా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నిలిచారని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాల బొమ్మలసత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి…

Read More

వికారాబాద్‌లో ముమ్మరంగా వీధి కుక్కల నియంత్రణ చర్యలు.

వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలో వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో తిరుగుతున్న కుక్కలను పట్టుకొని, వాటికి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.పట్టణంలో ఇప్పటి వరకు మొత్తం 630 వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. గత నెల 19వ తేదీన ఒక్కరోజే 35 కుక్కలను (15 మగ, 20 ఆడ) పట్టుకొని ప్రత్యేక కేంద్రానికి తరలించారు.పట్టుబడిన కుక్కలలో ఈ నెల 2వ తేదీన 8 కుక్కలకు…

Read More

11న ‘పుర’ ఎన్నికల షెడ్యూల్!

రాష్ట్రంలో అనుకున్నదాని కంటే ముందుగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 125 పురపాలక సంఘాల ఎన్నికలకు ఈ నెల 11నే షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని ఆ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఓటర్ల జాబితాలు సహా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సర్వం సిద్ధం చేసుకున్నట్టు వెల్లడిస్తున్నాయి. సంక్రాంతి పండుగ తరువాత మున్సిపల్ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని, ఫిబ్రవరి రెండో వారంలోపు ఎన్నికలు పూర్తవుతాయని తొలుత ప్రచారం జరిగింది. కానీ…

Read More

హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలి : పట్నం మహేందర్ రెడ్డి.

ప్రభుత్వం హోం గార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సాగినశాసన పరిషత్తు 25 వ సమావేశాల మూడవ రోజు ప్రశ్నోత్తరాల సమయం తరువాత సాగిన ప్రత్యేక ప్రస్తావన లో ఆయన హోం గార్డుల సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 14,000 మంది హోంగార్డులు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారని చెప్పారు. పోలీస్ శాఖ లోని ఉన్నతాధికారులు మొదలు కానిస్టేబుల్…

Read More

రోబోటిక్ టెక్నాలజీ తో సమస్యల గుర్తింపు…..ఎండీ అశోక్ రెడ్డి..

కలుషిత నీరు సరఫరాతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది. కలుషిత నీరు ఫిర్యాదులను ‘జీరో’కు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వివిధ కారణాలతో ప్రతినిత్యం కలుషిత నీరు ఫిర్యాదులు నమోదు అవుతాయని, వెంటనే అధికారులు స్పందించి…..

Read More

సీఎంకు మేయర్ శుభాకాంక్షలు.

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్‌ లోని సీఎం నివాసంలో శనివారంమర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళాశక్తికి ప్రతీక సావిత్రిబాయి పూలే:మేయర్ అనంతరం మేయర్ ఫిల్మ్ నగర్ లో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతినీ పురస్కరించుకుని సావిత్రి భాయి పూలే –జ్యోతి బాపురావు పూలే నిలువెత్తు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళల విద్య కోసం సావిత్రిబాయి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. మహిళాశక్తికి ప్రతీక సావిత్రిబాయి పూలే…

Read More

మారిషస్ అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్.

గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ సిటీలో ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు నేటి నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనడానికి మారిషస్ అధ్యక్షులు శ్రీ ధరమ్ బీర్ గోకుల్ సతీసమేతంగా శనివారం సాయంత్రం గుంటూరు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన రాకను పురస్కరించుకుని ITC వెల్కమ్ హోటల్ వద్ద జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ మారిషన్ దేశాధ్యక్షుల…

Read More

రాజేంద్రనగర్ లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు.

సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలదండ వేసి పుష్పాంజలి ఘటించారు. రిజిస్ట్రార్ డాక్టర్ G.E.CH. విద్యాసాగర్ తో పాటు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది సావిత్రిబాయి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు…

Read More