జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ లోని సీఎం నివాసంలో శనివారం
మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
మహిళాశక్తికి ప్రతీక సావిత్రిబాయి పూలే:మేయర్
అనంతరం మేయర్ ఫిల్మ్ నగర్ లో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతినీ పురస్కరించుకుని సావిత్రి భాయి పూలే –జ్యోతి బాపురావు పూలే నిలువెత్తు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మహిళల విద్య కోసం సావిత్రిబాయి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. మహిళాశక్తికి ప్రతీక సావిత్రిబాయి పూలే అని మేయర్ కొనియాడారు.
విద్యనే ఆయుధంగా చేసుకుని సమానత్వం కోసం పోరాడిన వారి జీవితం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.
సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ పిలుపునిచ్చారు.
మహిళల విద్యకు సావిత్రీబాయి ఫూలే అందించిన అపారమైన కృషినీ గుర్తించి
వారి జయంతి రోజైన జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలనీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని మేయర్ అన్నారు.
