రాజేంద్రనగర్ లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు.

Spread the love

సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలదండ వేసి పుష్పాంజలి ఘటించారు. రిజిస్ట్రార్ డాక్టర్ G.E.CH. విద్యాసాగర్ తో పాటు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది సావిత్రిబాయి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *