సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాష్.
సింగరేణి సిఎండి గా బాధ్యతలు చేపట్టిన జ్యోతి బుద్ద ప్రకాశ్ శుక్రవారం ప్రజాభవన్ లో డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ను మర్యాపూర్వకంగా కలిశారు.
సింగరేణి సిఎండి గా బాధ్యతలు చేపట్టిన జ్యోతి బుద్ద ప్రకాశ్ శుక్రవారం ప్రజాభవన్ లో డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ను మర్యాపూర్వకంగా కలిశారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను శుక్రవారం సాయంత్రం విజయవాడలోని లోక్ భవన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో గౌరవ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు.
హెరిటేజ్ ఫుడ్స్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, కల్పిత కథలతో కూడినవేనని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ పి. కుటుంబరావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. ఒక పత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా ఫిక్షన్ రైటింగ్ తప్ప వాస్తవాలు ఏమీ లేవని విమర్శించారు. ప్రజలు చదివేది నిజమా కాదా అన్న కనీస బాధ్యత లేకుండా వార్తలు వండివార్చడం బాధాకరమన్నారు.. హెరిటేజ్…
కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డిమేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం కిసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుండి 18 వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను శుక్రవారం మాఘబహుళ ఏకాదశి ఉదయం గణపతి పూజ కార్యక్రమంతో ప్రారంభించారు.అంతకుముందు ఆలయం లో స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. కీసర గుట్ట జాతర కార్యక్రమంలో మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాపోటీలు…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) డిప్యూటీ మేయర్‌గా ఐదేళ్ల పాటు నిరంతర సేవలందించిన మోతే శ్రీలత శోభన్ రెడ్డి పదవీకాలం మంగళవారం తో అధికారికంగా ముగిసింది. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె తన పదవీకాలాన్ని సఫలీకృతం చేయడంలో సహకరించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, ప్రజాప్రతినిధులు, జిహెచ్ఎంసి కమిషనర్లు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, కార్యాలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు, అలాగే నగర ప్రజలందరికీ హృదయపూర్వక…
చాదర్ ఘాట్ లో అప్ గ్రేడెషన్, రెనో వేట్ చేసిన విక్టోరియా ప్లే గ్రౌండ్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ లతో కలిసి మంగళవారం ప్రారంభించారు. పునరుద్ధరించిన విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఉన్న బాస్కెట్ బాల్ నెట్, క్రికెట్ నెట్ స్థానిక క్రీడాకారులకు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఎంతో ఉపకరిస్తుందనీ మేయర్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడాకారులుగా రాణించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో…
మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సంబంధించి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిఎన్ఆర్ కన్వెన్షన్ లో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్., ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపల్ ఎన్నికల బందోబస్తు నిర్వర్తించే సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఎల్లంపేట, అలియాబాద్ మున్సిపాలిటీల్లోని డబిల్ పూర్ డిస్ట్రిబ్యూషన్ & కౌంటింగ్ కేంద్రాన్ని, డబిల్ పూర్ లోని ఎన్నికలు జరిగే కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన…
• స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను కేంద్ర మంత్రికి వివరించిన సీఎం చంద్రబాబు. • వేస్ట్ మేనేజ్మెంట్, జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు తీసుకున్న చర్యలను ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి. • స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0″ కింద రూ. 276 కోట్ల ఖర్చుతో జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ కు కార్యాచరణ రూపొందించినట్టు చెప్పిన సీఎం చంద్రబాబు. • స్వచ్ఛ భారత్ మిషన్-2.0లో భాగంగా…
• వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టడంతో కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి• కేంద్రం అందించిన ఆర్ధిక సాయం, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, స్టీల్ ప్లాంట్ కార్మికులు-ఉద్యోగుల పట్టుదల, శ్రమతో లాభాలు సాధ్యమయ్యాయని కుమారస్వామికి వివరించిన సీఎం• వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు సాధించడంతో పాటు, పూర్తి స్థాయి సామర్ధ్యం మేర పనిచేస్తోందని చెప్పిన సీఎం• ఆర్ఐఎన్ఎల్ విషయంలో భవిష్యత్‌లోనూ ఇంతే తోడ్పాటు, సహకారాన్ని అందించాలని కేంద్రాన్ని కోరిన సీఎం చంద్రబాబు
ప్రభుత్వ పాఠశాలకు క్రీడామైదానాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చింది హైడ్రా. తమ పాఠశాల క్రీడామైదానం 33 గుంటల మేర ఉండగా.. వాహిద్ అనే వ్యక్తి ఆక్రమించి తన ఆధీనంలోకి తీసుకున్నారని ఆ పాఠశాల హెడ్ మాస్టర్ హైడ్రా ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ శl ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు 24 గంటల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపారు హైడ్రా అధికారులు. సోమవారం హైడ్రా ప్రజావాణిలో ఈ మేరకు ఫిర్యాదు చేయగా.. మంగళవారం ఆక్రమణలను…