చాదర్ ఘాట్ లో అప్ గ్రేడెషన్, రెనో వేట్ చేసిన విక్టోరియా ప్లే గ్రౌండ్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ లతో కలిసి మంగళవారం ప్రారంభించారు.
పునరుద్ధరించిన విక్టోరియా ప్లే గ్రౌండ్
లో ఉన్న బాస్కెట్ బాల్ నెట్, క్రికెట్ నెట్ స్థానిక క్రీడాకారులకు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఎంతో ఉపకరిస్తుందనీ మేయర్ తెలిపారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడాకారులుగా రాణించాలని ఆమె కోరారు.
కార్యక్రమంలో గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
