ఆదివారం ఎన్‌టిఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్థంతి కార్యక్రమాన్ని ఎన్‌టిఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించింది. ఈ సందర్భంగా లెజెండరీ బ్లెడ్ డొనేషన్ అండ్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకవిశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు కి ఆత్మీయ నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎన్‌టిఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఈ సందర్భంగా ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ... తెలుగుప్రజలకు అన్నగా పిలుచుకునే ఎన్‌టిఆర్ 30వ వర్థంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి వర్థంతికి ఎన్‌టిఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఎన్‌టిఆర్ గ సేవా భావంతో రాజకీయాలలోకి అడుగుపెట్టడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే నారా చంద్రబాబు నాయుడు ఎన్‌టిఆర్ మెమోరియల్ ట్రస్ట్‌ను స్థాపించడం జరిగింది. ఈ ట్రస్ట్‌కు మేనేజింగ్ ట్రస్టీగా ప్రజలకు సేవలు అందించే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే అదృష్టం నాకు కలిగింది. ప్రజల అవసరాలను ట్రస్ట్ ద్వారా మేము సేవలు అందించడానికి ముందు ఉంటాం. ఎన్‌టిఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నామంటే దానికి ముఖ్య కారణం దాతలే. కడియాల రాజేందర్, మన్‌మీత్ సింగ్ వంటి ఎంతో మంది దాతల సహకారంతో మేము ఎన్‌టిఆర్ ట్రస్ట్‌ను ముందుకు తీసుకెళ్లగలుతున్నాం. ఈ దాతలు ఎన్‌టిఆర్ గారిపై ప్రేమతో ముందుకు వస్తున్నారు. ఎన్‌టిఆర్ ట్రస్ట్‌కు విరాళాలు ఇస్తే ప్రజలకు అందుతుందనే నమ్మకంతో చేస్తున్నారని అన్నారు. ఎన్‌టిఆర్ ట్రస్ట్ తరపున బ్లడ్ బ్యాంక్ కేంద్రాలను హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్‌టిఆర్ ట్రస్ట్ తరపున నాణ్యమైన రక్తాన్ని అవసరమైన ప్రజలకు అందిస్తున్నాం. ముందుగా తలసేమియా పిల్లలకు అవసరమైన బ్లెడ్‌ను ఇచ్చిన తరువాతనే ఇతరులకు ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పటి వరకు ఎన్‌టిఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా 5 లక్షల బ్లడ్ యూనిట్స్‌ను సేకరించడం జరిగింది. ఈ యూనిట్ల ద్వారా 9 లక్షల 18 వేల మందికి ఎన్‌టిఆర్ ట్రస్ట్ తరపున రక్తాన్ని అందించగలిగాం. వ్యక్తిగత జీవితంలో స్థిరపడిన తరువాత ప్రతి ఒక్కరూ ఎంతో కొంత తిరిగి సమాజానికి, దేశానికి ఇవ్వాలనే భావనతో ముందుకు రావాలని ప్రజలందరినీ ఈ సందర్భంగా కొరుతున్నాము. ఎన్‌టిఆర్ మెమోరియల్ ట్రస్ట్ మాత్రమే కాకుండా చాలా మంది తమతమ ట్రస్ట్‌ల ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వెళ్తున్నారు. ఎన్‌టిఆర్ ట్రస్ట్ ద్వారా ‘‘స్త్రీ శక్తి హస్తకళ’’ ద్వారా మహిళలకు వివిధ చేతి వృత్తులలో కుప్పం నైపుణ్య కేంద్రంలో శిక్షణను ఇచ్చి వారికి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా చేస్తున్నాం. హైదరాబాద్‌లో స్త్రీ శక్తి హస్తకళ స్టోర్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, ఎన్‌టిఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్రకుమార్, సీవోవో అడుసుపల్లి గోపి, ఎన్‌టిఆర్ కుటుంబ సభ్యులు గారపాటి శ్రీనివాస్, జాతీయ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, రాష్ట్ర పార్టీ నాయకులు అజ్మీరా రాజునాయక్, శ్రీపతి సతీష్ కుమార్, పోలంపల్లి అశోక్, పొగాకు జయరామ్‌చందర్, తెలుగుదేశం ప్రకాష్‌రెడ్డి, పార్లమెంట్ పార్టీ కన్వీనర్లు కుందారపు కృష్ణాచారి, సంజయ్, అమర్‌నాథ్, సంధ్యపోగు రాజశేఖర్, వేజెండ్ల కిశోర్‌బాబు, ముంజ వెంకట్రాజంగౌడ్, సైదేశ్వర్ రావు, జనగాం నర్సింగ్‌రావు, సాంబశివ రావు, యాదీలాల్, గూడెపు రాఘవులు, జగదీష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ శిబిరంలో బసవతారకం ఇండోఅమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి మరియు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వారు…, డాక్టర్ కడియాల రాజేందర్, డాక్టర్ కడియాల విద్య ఆధ్వర్యంలో ఏపీ సూపర్‌స్పెషాలిటీ డెంటల్ ఆస్పత్రి తరపున మెగా ఫ్రీ డెంటల్ క్యాంపును…, మన్‌మీత్‌సింగ్ (సోనూ) ఇన్ అసోసియేషన్ విత్ యోదా డయోగ్నస్టిక్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, కన్సల్టేషన్, మెడిసిన్ అండ్ ఈసీజీ…, డాక్టర్ అవినాష్ ఆధ్వర్యంలో ఓమెగా పిఆర్‌కె, మల్టీస్పెషాలిటీ అండ్ క్యాన్సర్ ఆస్పత్రి తరపున ఈఎన్‌టి (చెవి, ముక్కు, గొంతు లకు సంబంధించి)…, మంత్రి ఐజయ్య ఆధ్వర్యంలో ‘హియర్‌జాప్’ వారి తరపున హియరింగ్‌కు సంబంధించి…, కెఎస్‌ఆర్ ఐకేర్ ప్రైవేట్ లిమిటెడ్, సిటీ ఐ ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలకు సంబంధించి క్యాంపులను ఏర్పాటు చేశారు. లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపులో రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరినీ నారా భువనేశ్వరి పలకరించారు. అలాగే వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్‌టిఆర్ మెమోరియల్‌ట్రస్ట్ తరపున అవసరమైన వారికి మందులను ఉచితంగా అందించడం జరిగింది.
గత రెండున్నర సంవత్సరాల నుండి మోతీలాల్ అధ్యక్షతన ఎశీసంష్ట్రaస్త్రఅa.శీతీస్త్ర.సబతీఅశీశీశ్రీ పేరుతో ఎన్‌టిఆర్ ట్రస్ట్ తరపున 30 క్యాంపులను పెట్టి తలసేమియా బాధిత పిల్లలకొరకు 700 మంది రక్తదానం చేయడం జరిగింది.
జగిత్యాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పల్లెర్ల సురేందర్ ఈ సందర్భంగా రూ.25 వేల విరాళాన్ని ఎన్‌టిఆర్ ట్రస్ట్‌కు అందించడం జరిగింది.
మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన ఎన్‌టిఆర్ అభిమానులు గన్నేరు తిప్పన నాయకత్వంలో ఎన్‌టిఆర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన అమరజ్యోతి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఎన్‌టిఆర్ ట్రస్ట్‌లో జరిగిన ఎన్‌టిఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని శ నారా భువనేశ్వరి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్‌టిఆర్ ట్రస్ట్‌కు పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తమ సమస్యలను నారా భువనేశ్వరి కి విన్నవించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో
-కె. రాజేంద్ర కుమార్ ఐపిఎస్(రిటైర్డ్)
సీఈవో, ఎన్‌టిఆర్ మెమోరియల్ ట్రస్ట్.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం.
