మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష.

Spread the love

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా చేపట్టిన భద్రతా (బందోబస్తు) ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ఐపీఎస్ మేడారంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నియంత్రణ, సమ్మక్క సారలమ్మ ఊరేగింపు మార్గాలు తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ మ్యాప్స్, సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా అధునాతన డ్రోన్ టెక్నాలజీ ద్వారా పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సమీక్ష సమావేశంలో ములుగు జిల్లా ఎస్పీ శ్రీ కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ జాతర సందర్భంగా అమలు చేస్తున్న భద్రతా ప్రణాళికలు, పోలీసు బలగాల మోహరింపు, ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై డీజీపీకి వివరించారు.

డీజీపీ గారు జాతరకు వచ్చే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో ఐజీ మల్టీ జోన్–1 చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్, అంబర్‌కిషోర్ ఝా ఐపీఎస్,వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్,కరీంనగర్ సీపీ గౌస్ ఆలమ్ ఐపీఎస్,మహబూబాబాద్ ఎస్పీ శబరిష్ ఐపీఎస్,
భూపాలపల్లి ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ ఐపీఎస్,డీసీపీ శ్రీ అంకిత్ ఐపీఎస్, శివం ఉపాధ్యాయ ఐపీఎస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *