మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి,పాలేరు బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

సర్పంచ్ ఎన్నికల్లో 85% కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకొని రాష్ట్రానికి ఖమ్మం జిల్లా తలమానికంగా నిలిచింది రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులను కలిసి జిల్లాలో సాగునీటి పారుదల, విద్య, ఆరోగ్యానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే జేఎన్టీయూ విశ్వవిద్యాలయం బ్రాంచ్, నర్సింగ్ కళాశాల, సాగునీటిపారుదలలో…

Read More

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష.

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా చేపట్టిన భద్రతా (బందోబస్తు) ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ఐపీఎస్ మేడారంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నియంత్రణ, సమ్మక్క సారలమ్మ ఊరేగింపు మార్గాలు తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ మ్యాప్స్, సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా…

Read More

సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్……

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం పల్లె బాట పడుతుంది. ఈ ఏడాది కూడా అదే దృశ్యం పునరావృతమవుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. గడిచిన మూడు రోజుల్లోనే నగరం నుంచి సుమారు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు తమ స్వగ్రామాలకు తరలివెళ్లారు. బస్టాండ్ల వద్ద భారీ రద్దీ.. భాగ్యనగరం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధాన కేంద్రాలైన దిల్‌సుక్ నగర్, ఉప్పల్,…

Read More

మియాపూర్ లో హైడ్రా భారీ ఆపరేషన 3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మ‌హ‌బూబ్‌ పేటలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన మైడ్రా.

Read More

గోడ పత్రికలను ఆవిష్కరించిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.

అన్నపురెడ్డిపల్లి విద్యావేత్త, హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరావు శనివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనభద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే మండల అవతరణ దశాబ్ది ఉత్సవాలు, సంక్రాంతి సంబరాల గోడపత్రికలను ఆవిష్కరించారు. హరిహర ఫౌండేషన్…

Read More

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి క్యారెక్టర్ ను దెబ్బతీస్తూ వస్తున్న సోషల్ మీడియా టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.

గత కొద్ది రోజులుగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై వస్తున్న నిరాధార కథనాల ను తీవ్రంగా ఖండిస్తున్నానుఎదుటి వ్యక్తి పై బురదజల్లే ఈ సంప్రదాయం మంచిది కాదు* ఎవరైనా దురుద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తలు రాయాలని ప్రోత్సహించినా… అది మంచి పద్దతి కాదు* కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి వ్యతిరేఖంగా సోషల్ మీడియా లో రాయాలని ఒక వేళ ప్రేరేపిస్తే ఆ వ్యక్తులది అతి పెద్ద తప్పు* అలా ప్రేరేపించినోడికి… ప్రేరేపిస్తే వేసినొడికి బుద్ధి…

Read More

యువత మత్తు అలవాట్లకు, కాదు… మైదానం బాట పట్టాలిమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

19వ రాజీవ్ గాంధీ అండర్–19 లీగ్ టీ20 క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026 ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలైన హైదరాబాద్ జట్టుకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… ప్రస్తుతం యువత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనవసరపు అలవాట్లకు గురవుతున్నారని చెప్పారు. ముఖ్యంగా ఈ తరం యువత మత్తు పదార్థాలతో…

Read More

సొంతూరు బాట పట్టిన జనంవిజయవాడ-హైదరాబాద్ హైవేపై పెరిగిన రద్దీ.

సంక్రాంతి పండగ సెలవులు ప్రారంభం కావటంతో ప్రజలంతా సొంతూళ్లకు పయనమయ్యారు.ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. ఈరోజు ఉదయమే హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్‌, పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. సం­క్రాం­తి పం­డుగ సమీ­పి­స్తుం­డ­టం­తో రహ­దా­రు­ల­పై ప్ర­యా­ణి­కుల రద్దీ ఇంకా పె­రి­గే సూ­చ­న­లు కని­పి­స్తు­న్నా­యి. ము­ఖ్యం­గా హై­ద­రా­బా­ద్‌ నుం­చి ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు వె­ళ్లే వా­హ­నా­లు…

Read More

ఆందోల్ నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్ష.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గంలో సాగునీటి పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సింగూర్ కాల్వల మరమ్మత్తులు, లైనింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఖరిఫ్ కు రైతులకు సాగునీరు అందించాలని మంత్రి అధికారులను అదేశించారు. పెద్దారెడ్డి పేట లిప్ట్ ఇరిగేషన్ పనులపై ఈ సమావేశంలో చర్చించారు. నియోజక వర్గంలో 40 ఏకరాలకు సాగునీరు అందించేలా చేపట్టనున్న పెద్దారెడ్డి పేట…

Read More

కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఇంకో పార్టీ పుట్టేదే కాదు, మరో పార్టీకి భవిష్యత్తు ఉండేది కాదు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి లో కాంగ్రెస్ కీలక నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఇతర పార్టీలు రెండు మూడు దశాబ్దాల క్రితం చేసిన ఐదు లక్షల పనిని మైకు దొరికిన ప్రతిసారి…

Read More