మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి క్యారెక్టర్ ను దెబ్బతీస్తూ వస్తున్న సోషల్ మీడియా టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.

Spread the love

గత కొద్ది రోజులుగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై వస్తున్న నిరాధార కథనాల ను తీవ్రంగా ఖండిస్తున్నాను
ఎదుటి వ్యక్తి పై బురదజల్లే ఈ సంప్రదాయం మంచిది కాదు*

ఎవరైనా దురుద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తలు రాయాలని ప్రోత్సహించినా… అది మంచి పద్దతి కాదు*

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి వ్యతిరేఖంగా సోషల్ మీడియా లో రాయాలని ఒక వేళ ప్రేరేపిస్తే ఆ వ్యక్తులది అతి పెద్ద తప్పు*

అలా ప్రేరేపించినోడికి… ప్రేరేపిస్తే వేసినొడికి బుద్ధి లేదు*

తెలంగాణ రాజకీయాల్లో ఒక చరిష్మా ఉన్న నేత , ఒక పొలిటికల్ ఫిగర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ఎన్ఎస్ యుఐ నుండి మొదలుకుని ఒక విద్యార్థి నేతగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, మంత్రి గా అంచెలంచెలుగా కష్టపడి ఎదిగిన నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్ర రాజకీయాల్లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ది ఒక చరిత్ర
ఎంతో కష్టపడి , వ్యయ ప్రయాసలకోర్చి అంచెలంచెలుగా ఎదిగిన నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఒక ఆడ, మగ మాట్లాడితే పెడర్థాలు తీస్తారా
ఇదొక ప్రజా సమస్యనా… రాష్ట్ర సమస్యనా? పనిగట్టుకుని బురద జల్లుతున్నారు

సోషల్ మీడియా ఇలాంటి ఇలాంటి వార్తలు బదులు… ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను వెలికి తీయండి

మీ అక్కతోనో, చెల్లి తోనో, అమ్మతోనో మాట్లాడితే ఇలానే రాస్తారా ఇదెక్కడి సాంప్రదాయం
లక్షలు, కోట్లు అప్పులు చేసి ప్రజలకు సర్వీస్ చేసి వస్తాం…. మమ్మలనా మీరు బదనాం చేసేది

నాలుగు అక్షరం ముక్కలు వస్తాయని…. చెత్త వార్తలు రాసి పర్సనాలిటీ డామేజ్ చేస్తారా

కోమటి రెడ్డి పై వార్తలు రాయాలని చెప్పిన వాడికి బయటకు వచ్చి చెప్పే దమ్ముందా

మీరు వార్తలు రాసినంత మాత్రాన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి క్యారెక్టర్ డామేజ్ అయితధా.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *