యువత మత్తు అలవాట్లకు, కాదు… మైదానం బాట పట్టాలిమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

Spread the love

19వ రాజీవ్ గాంధీ అండర్–19 లీగ్ టీ20 క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026 ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలైన హైదరాబాద్ జట్టుకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… ప్రస్తుతం యువత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనవసరపు అలవాట్లకు గురవుతున్నారని చెప్పారు. ముఖ్యంగా ఈ తరం యువత మత్తు పదార్థాలతో పాటు ఇతర పలు చెడు వ్యసనాలకు లోనవుతున్నారని
ఆవేదన వ్యక్తం చేశారు
ఇలాంటి వ్యసనాల బానిస బాట కాకుండా వాటికి బదులు ప్రతి ఒక్కరు
వీలైనంత సమయాన్ని మంచి ఆరోగ్యం కొరకు మైదానాల బాట పట్టి వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ యువతకు పిలుపునిచ్చారు.

స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నేత అని గుర్తు చేశారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఆయన చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ అకాల మరణం దేశానికి తీరని లోటని అన్నారు.

గత దశాబ్ద కాలంగా తెలంగాణలో క్రీడా రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. సరైన మౌలిక వసతులు, ప్రోత్సాహకాలు లేక ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు వెనుకబడ్డారని పేర్కొన్నారు.

అయితే, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇది తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా మార్చే దిశగా కీలక అడుగని అన్నారు.

అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులు క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపుతున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గురుకుల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధిస్తున్నారని చెప్పారు. పేద కుటుంబాల పిల్లలకు క్రీడలే జీవితాన్ని మార్చే ఆయుధమని పేర్కొన్నారు.

ఈ లీగ్‌లో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల జట్లు పాల్గొనడం యువతలో క్రీడల పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమని మంత్రి అన్నారు. ఫైనల్‌లో విజయం సాధించిన హైదరాబాద్ జట్టును ప్రత్యేకంగా అభినందించారు.

క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఐక్యత, పోరాట స్పూర్తి పెరుగుతాయని, అదే యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.

గత 20 సంవత్సరాల నుండి
స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి పేరు మీదుగా ఈ పోటీలు నిర్వహిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు గారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో , క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాజీ ఎంపీ వి హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు హర్కర వేణుగోపాల్, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయికుమార్ , శివసేన రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ , డిసిసి అధ్యక్షులు మోతే రోహిత్, సయ్యద్ సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *