మియాపూర్ లో హైడ్రా భారీ ఆపరేషన 3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.

Spread the love

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మ‌హ‌బూబ్‌ పేటలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన మైడ్రా.

  • స‌ర్వే నంబర్ 44 లో 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.
  • ఇదే సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి అవుతున్నట్టు హైడ్రా ప్రజావానికి గ‌తంలో అందిన ఫిర్యాదు.
  • హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు గతంలోనే 5 ఎకరాలను స్వాధీనం చేసుకున్న హైడ్రా.
  • మియాపూర్ – బాచుప‌ల్లి ప్ర‌ధాన ర‌హ‌దారికి స‌మాంత‌రంగా ఉన్న చెరువు క‌ట్ట‌పై 200ల మీట‌ర్ల మేర వేసిన 18 షెట్ట‌ర్ల‌ను హైడ్రా గ‌తంలోనే తొల‌గించింది.
  • తాజాగా మక్తా మహబూబ్ పేటలోని స‌ర్వే నంబ‌రు 44లోని ప్ర‌భుత్వ భూమికి సంబంధించి అక్ర‌మ రిజిస్ర్టేష‌న్ల‌తో పాటు.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ కు సంబంధించిన వార్తల నేపథ్యంలో మరోసారి విచారణ చేపట్టిన హైడ్రా.
  • తప్పుడు పత్రాలతో అక్క‌డి 43 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి క‌బ్జాకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు నిర్ధారించుకున్న హైడ్రా.
  • 159 సర్వే నంబర్‌లోని భూమి ప‌త్రాల‌తో సర్వే నంబర్ 44లోని ప్ర‌భుత్వ భూమిలో ఎకరన్నర వరకూ కబ్జా చేసిన‌ ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు.
  • స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్.
  • ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డు లు ఏర్పాటు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *