గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌తో తెలంగాణ మంత్రుల భేటీ.

ప్రపంచ ఆర్థిక వేదిక (వెఫ్)–2026 సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయిల్ ఫామ్ వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, హైదరాబాద్‌లో ఉన్న గోద్రేజ్ క్రీమ్‌లైన్ డెయిరీ ప్లాంట్‌ను రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నివాస ప్రాంతంలో…

Read More

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిఆర్ఎస్.

పేదల భూములు చట్టవిరుద్దంగా లాక్కుంటున్న రేవంత్ సర్కార్*ఈశా ఫౌండేషన్ ఫ్యూచర్ సిటీలో పెట్టొచ్చు కదా?కేసిఆర్ ధనవంతులను చేయాలని చూస్తే,రేవంత్ అడ్డాకూలీలుగా మారుస్తున్నారుబలవంతంగా లాక్కుంటే,లగచర్ల స్ఫూర్తితో పోరాడుతం ల్యాండ్ పూలింగ్ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్ట విరుద్దంగా పేదల భూములను లాక్కుంటుందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. భూములు ఎందుకోసం తీసుకుంటున్నారు, ఏం కంపెనీలు పెడతారు,ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పకుండా పేదలను మోసం చేసి అన్యాయంగా విలువైన భూములను ఆక్రమించాలని చూస్తున్నారని…

Read More

పార్క్ ను అద్భుతంగా తీర్చిదిద్దారంటూ జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి ప్రశంస.

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పౌర సదుపాయాల అభివృద్ధి సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రంజూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో 3.10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన జీహెచ్ఎంసీ చిల్డ్రన్ ప్లే పార్క్ ను ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి,మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్,జోనల్ కమిషనర్ ప్రియాంక అలా తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..

Read More

బంజారా హిల్స్ లో మేయర్ గద్వాల విజయలక్ష్మి.

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్‌లో బస్తీ ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.మేయర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, బంజారాహిల్స్ డివిజన్‌లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం మరియు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరణాత్మక చర్చ జరిగింది.మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం ద్వారా స్థానిక ప్రజలకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని, ఇది ప్రాంత అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని మేయర్ తెలిపారు.ఈ సమావేశంలో బస్తీ ప్రజల…

Read More

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్,తదితరులు ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి ఉక్కు విగ్రహం ఏర్పాటు కావడం చారిత్రాత్మక శుభపరిణామం దేశ ప్రయోజనాల కోసం దృఢమైన, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్న నాయకురాలు ఇందిరాగాంధీ దేశానికి దశ, దిశ చూపిన దూరదృష్టి గల మహానేత సాహసోపేతమైన నిర్ణయాలకు చిరునామాగా నిలిచిన ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేసి సామాన్య ప్రజలకు ఆర్థిక శక్తిని అందించిన నాయకురాలు నిజమైన ప్రజాస్వామ్య పాలనను దేశానికి అందించిన…

Read More

దుర్గంచెరువు దుర్గంధంపై హైడ్రా న‌జ‌ర్‌క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌.

మాధాపూర్ గుట్ట‌ల్లో ఉన్న దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా దృష్టి పెట్టింది. చెరువులోకి నేరుగా మురుగు నీరు చేర‌డాన్ని హైడ్రా తీవ్రంగా ప‌రిగ‌ణించింది. దుర్గంచెరువులో గుర్ర‌పు డెక్క వ్యాప్తి చెంద‌డం.. దుర్గంధంగా మార‌డంప‌ట్ల మీడియా క‌థ‌నాలు, స్థానికుల నుంచి హైడ్రాకు వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు మంగ‌ళ‌వారం దుర్గం చెరువును ప‌రిశీలించారు. చెరువులో స‌గ‌భాగం వ‌ర‌కూ గుర్ర‌పు డెక్క వ్యాపించడానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. ఎస్‌టీపీలు ఉన్న‌ప్ప‌టికీ వ‌ర‌ద కాలువ…

Read More

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి –నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క,

గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రతి సర్పంచ్ పని చేయాలని పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం జిల్లా కేంద్రం లోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొనిమాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాది లాంటివని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందని తెలిపారు. త్రాగునీరు, పారిశుధ్యం,…

Read More

హైదరాబాద్ ఎన్నికలు..ఇప్పట్లో లేనట్టే..!ఫిబ్రవరి 10 తర్వాతే విభజన.

మూడు గ్రేటర్లు ఐతే పక్కారాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైనప్పటికీ గ్రేటర్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. మహానగర ఎన్నికలు ఫిబ్రవరి 10 తర్వాతే జరుగుతాయన్నారు. జీహె చ్ఎంసీ ఒకే కార్పొరేషన్ గా కొనసాగుతుందా లేక మూడు కార్పొరేషన్లుగా విభజన జరుగుతుందా అన్న సస్పెన్సు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల చైర్ పర్సన్స్, మేయర్ సీట్లతో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్లను…

Read More

తెలంగాణ సల్లగుండాలని…

మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం అమ్మవార్ల గద్దెల శాశ్వత నిర్మాణాలపై ఆర్‌ & ‌బి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read More

మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.

అతిపెద్ద ఆదివాసీ పండుగ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం జరిగిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రివర్గ సహచరులతో కలిసి బస్సులో జంపన్న వాగు సర్కిల్ వరకు ప్రయాణించి, జాతరకు వచ్చే లక్షలాది భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.జాతరకు సంబంధించి పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల వినియోగాన్ని ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అక్కడ ఏర్పాటు…

Read More