జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్‌లో బస్తీ ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మేయర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, బంజారాహిల్స్ డివిజన్‌లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం మరియు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరణాత్మక చర్చ జరిగింది.
మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం ద్వారా స్థానిక ప్రజలకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని, ఇది ప్రాంత అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని మేయర్ తెలిపారు.
ఈ సమావేశంలో బస్తీ ప్రజల అభిప్రాయాలను తీసుకుని, వారి సమస్యలపై చర్చించి, త్వరితగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.
బంజారాహిల్స్ డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పార్కులు, స్వచ్ఛత వంటి వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇవి పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో GHMC డెప్యూటీ కమిషనర్, SE, డివిజన్ అధికారులు, వాటర్ వర్క్స్ మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ , బస్తీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
బంజారా హిల్స్ లో మేయర్ గద్వాల విజయలక్ష్మి.
