గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పౌర సదుపాయాల అభివృద్ధి సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో 3.10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన జీహెచ్ఎంసీ చిల్డ్రన్ ప్లే పార్క్ ను ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి,మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్,జోనల్ కమిషనర్ ప్రియాంక అలా తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44, 45 మధ్యలో లో ఖాళీగా ఉపయోగంలో లేకుండా ఉన్న ప్రాంతం ఒక ఎకరా 40 గుంటల్లో సీఎం సూచనల మేరకు మేయర్ అధ్వర్యంలో చిల్డ్రన్ ప్లే పార్క్ ను జీహెచ్ఎంసీ అద్భుతంగా అభివృద్ధి చేసిందన్నారు.
పార్క్ లో 10 లక్షల లీటర్ల వర్షపు నీటిని నిల్వ చేసే స్టోరేజ్ ప్లాంటు ,వాకింగ్ ట్రాక్ , యోగ ,టెన్నిస్ కోర్టు వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు.
పిల్లలు, పెంపుడు జంతువులు కోసం ప్రత్యేక స్థలం పార్క్ లో కేటాయించారని చెప్పారు.
పార్క్ ఏర్పాటుతో
ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు, పిల్లలకు
ఆహ్లాద వాతావరణంతో పాటు వినోదం కు ఉపకరిస్తుందన్నారు.
దీనిని ప్రజలంతా ఉపయోగించుకోవాలన్నారు.
సీఎం హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అన్ని రకాల ప్రణాళికలతో కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.
ముఖ్యంగా మౌలిక సదుపాయాలు హైదరాబాద్ లో ఇన్క్లూజివ్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం పై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలిపారు.
రాబోయే తరాల వారికి హైదరాబాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… సమీప ప్రాంత ప్రజలు ఉదయం , సాయంత్రం సేదదీరెందుకు, వినోదం, రిక్రియేషన్, వ్యాయామం, క్రీడలు ఆడుకునేందుకు ప్రజలకు జీహెచ్ఎంసీ పార్క్ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.
పార్క్ ను ప్రారంభించిన అనంతరం పిల్లలు ఆడుకునే ఆట స్థలాలు,టెన్నిస్ కోర్టు ,యోగా స్థలాలు ,వాటర్ స్టోరేజీ ప్లేస్, గార్డెన్ లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.పార్క్ ను అద్భుతంగా తీర్చిదిద్దారంటూ
జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి ప్రశంసించారు.
అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి,మేయర్ గద్వాల విజయ లక్ష్మీ తో కలిసి మంత్రి టెన్నిస్ ఆడారు.
