రంగారెడ్డి తెలంగాణ కానుక
అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ (రాజ్యసభ) జన్మదినోత్సవ వేడుకలు గురువారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ బషీరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ ఎంపి అనిల్ కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్ , వనస్థలిపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లూరి శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
