బండ్లగూడ తెలంగాణ కానుక
శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు వస్తున్న బీఆర్‌ఎస్ శాసనసభ్యులను అడ్డుకోవడమే కాకుండా, మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తిస్తూ భౌతికంగా దాడులకు పాల్పడటం తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ రాజేంద్రనగర్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి వి. రాముడు యాదవ్ అన్నారు.
మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టుకుని లాగడం, గొంతు నొక్కడం వంటి పోలీసుల దౌర్జన్య చర్యలు అత్యంత దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతో గౌరవంగా వ్యవహరించాల్సిన పోలీసులు, ప్రభుత్వ ఆదేశాల పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పోలీసుల దౌర్జన్యకాండ పరాకాష్టకు చేరిందని రాముడు యాదవ్ మండిపడ్డారు. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సరికాదని, నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని అన్నారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాముడు యాదవ్ అన్నారు.
