మణికొండ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఘనంగా కాలోజి నారాయణరావు జయంతి వేడుకలు,

Spread the love

మణికొండ తెలంగాణ కానుక

మణికొండ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ప్రముఖ కవి, ప్రజాకవి కాలోజి నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాలోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, భౌగోళిక స్థితిగతులు, తెలంగాణ అస్తిత్వం కోసం కాలోజి నారాయణరావు అహర్నిశలు కృషి చేసిన మహానేత అని వక్తలు కొనియాడారు. తన రచనలు, కవిత్వం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

కాలోజి నారాయణరావు జీవితం, సాహిత్యం నేటి యువతకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *