అతి త్వరలో నెమలి నగర్ కు బస్సు సౌకర్యం కొండకళ్ల రామకృష్ణారెడ్డి,

Spread the love

మణికొండ తెలంగాణ కానుక

అతి త్వరలో నెమలి నగర్ ప్రజల ఆర్టీసీ బస్సు సౌకర్యం కల నెరవేరనుందని మాజీ కౌన్సిలర్ కొండకల రామకృష్ణారెడ్డి అన్నారు. విద్యార్థులు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకొని 10 రోజుల క్రితమే కమిటీ సభ్యులతో కలిసి రామకృష్ణారెడ్డి ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం అందజేశారు.స్పందించిన ఆర్టీసీ అధికారులు గురువారం అధికారి ధర్మేంద్ర నెమలి నగర్ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నెమలి నగర్ ప్రజలు మాట్లాడుతూ పేద విద్యార్థులు మహిళలు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారు

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారి దర్మెంద్ర, మున్సిపల్ మాజీ ప్లొర్ లిడార్ రామకృష్ణ రెడ్డి .ప్రెసిడెంట్,సత్యానారయణ, వైఎస్ ప్రెసిడెంట్ అశోక్, కోశాధికారి ఆంజనేయులు, నాయకులు,బాలయ్య, నరసింహ్మ, ప్రజలు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *