కాటేదాన్ తెలంగాణ కానుక.
జ్ఞానాన్ని పెంచే గురువును దైవంతో సమానంగా భావించాలని గురువులను గౌరవించడం మన సంస్కృతి అని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు.రాజేంద్రనగర్ మండల స్థాయిలో పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయులు గా జిల్లా మరియు మండలం స్థాయి లో ఎన్నికైన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. బుధవారం దుర్గా కన్వెన్షన్ హాలు లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ హజరై ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది ఉపాధ్యాయులేనని వారి కృషి వెలకట్టలేనిదని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్ వివిధ పాఠశాల హెడ్మాస్టర్ ఈ స్వీట్ మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి యాదగిరి, మహేష్ టిఆర్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుదర్శన్ శ్రీనివాస్ సాగర్ ఎస్టియు మండల అధ్యక్షుడు వెంకటయ్య ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు జనార్దన్ చారి, టపాస్ అధ్యక్షులు బాలకృష్ణ ఉర్దూ మీడియం అసోసియేషన్ అధ్యక్షులు దస్తగిరి ఖాలేదు , ప్రైవేట్ పాఠశాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్ చారి, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, బాబురావు మండల ఉపాధ్యాయులు 300 మంది మరియు ఎమ్మార్సీ స్టాప్ బిక్షపతి ముస్తఫా, రమేష్, శివరాజ్ ,కృష్ణ పాల్గొన్నారు.
