మహాదేవపురంలో రూ.1 కోటి 20 లక్షల తో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం,

Spread the love

కుత్బుల్లాపూర్ తెలంగాణ కానుక

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 277వ డివిజన్ మహాదేవపురం పరిధిలోని కైసర్ నగర్‌లో సీఎంసీ స్పెషల్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.1 కోటి 20 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు.

కైసర్ నగర్‌లోని శివాలయం రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన రహదారుల నిర్మాణం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రతి కాలనీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

మహాదేవపురం కాలనీ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.1.20 కోట్ల నిధులు మంజూరు చేయించిన కొలన్ హన్మంత్ రెడ్డి గారికి కాలనీ వాసులు, వెల్ఫేర్ సొసైటీ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిద్ధనోళ్ల సంజీవ్ రెడ్డి, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్, మేడ్చల్-మల్కాజ్‌గిరి ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, మైనారిటీ నాయకులు షఫీ, సుల్తాన్ మీర్జా, దేవేందర్ నగర్ అధ్యక్షులు అపజల్ భాయ్, వాలి భాయ్, ఫారూఖ్ ఖాన్, అజీమ్ భాయ్, మునావర్ భాయ్, ఝాఫర్, ఇమ్రాన్, అసిఫ్, మహేందర్, గంగాధర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు, కాలనీ వాసులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *