శ్రీ రామ మందిర పునర్నిర్మాణానికి..

Spread the love

–లక్ష 11 రూపాయలు విరాళం అందజేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి

తాండూర్, తెలంగాణ కానుక: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఇంద్రానగర్‌లో గల ఏకైక శ్రీ రామ మందిరం పునర్నిర్మాణానికి మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బాల్‌రెడ్డి దంపతులు తమ వంతు సహకారంగా లక్ష 11 రూపాయలు విరాళాన్ని ఆలయ కమిటీకి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. విరాళం అందించిన దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తయినప్పటికీ మండపంతో పాటు మరికొన్ని పనులు మిగిలి ఉన్నాయని, భక్తులు, దాతలు తమ వంతు సహకారం అందించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *