కుత్బుల్లాపూర్ తెలంగాణ కానుక
మత్తు పదార్థాల వినియోగంలో 25 ఏళ్లలోపు దేశ యువతనే అధికంగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. మత్తు పదార్థాల వినియోగంపై యువతకు అవగాహన కలిగించేందుకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బ్రహ్మకుమారీస్ ఆధ్యాత్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ” నశా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమం ప్రచార పోస్టర్ ను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, యువకులు మత్తు పదార్థాల వినియోగముకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ…. దేశ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలను వినియోగించడం ద్వారా మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమై చేజేతులా వారి బంగారు భవిష్యత్తును వారే నాశనం చేసుకున్న వాళ్లు అవుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్ యోగిని బీకె. జ్యోతి బహన్ జి, ఎస్ఆర్ నగర్ ఇంచార్జ్ బీకే. మంజుల, బీకే.నాందేవ్, బీకే.నరేందర్, పలువురు బిఆర్ఎస్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
