మహేశ్వరం, తెలంగాణ కానుక
మహేశ్వరం మండల పరిధిలోని ఆకన్‌పల్లి గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీల ఇంఛార్జ్ కృష్ణ, మండల మాజీ అధ్యక్షుడు ఎర్ర గణేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీఎస్ ఆకన్‌పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా బోల్లెపాక ప్రభాకర్, అధికార ప్రతినిధిగా బోల్లెపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ముక్కెర ప్రవీణ్, ముక్కెర తరుణ్, బోల్లెపాక మైపాల్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా సంగెం రాకేష్, కార్యదర్శులుగా బోల్లెపాక నవీన్, సంగెం శివనంద్, సహాయ కార్యదర్శులుగా బోల్లెపాక సందీప్, బోల్లెపాక యాదయ్య, బోల్లెపాక జంగయ్య ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఇంఛార్జ్ కృష్ణ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మాదిగల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతి ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మహేశ్వరం మండల మాజీ అధ్యక్షుడు ఎర్ర గణేష్, బోల్లెపాక నరేష్, బోల్లెపాక వినోద్,శేఖర్, బన్ని తదితరులు పాల్గొన్నారు.
