సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి: కెఎల్

Spread the love

మహేశ్వరం తెలంగాణ కానుక

తెలంగాణ గడ్డపై సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, ప్రజల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ( కే ఎల్ ఆర్ ) అన్నారు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన కెఎల్ఆర్ , పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పాపన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచి, సమాజంలో సమానత్వం కోసం ఆయన సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
ప్రజల కోసం పనిచేయడం, బలహీన వర్గాలకు అండగా నిలవడం, సామాజిక న్యాయం కోసం కృషి చేయడం వంటి విలువలను సర్వాయి పాపన్న జీవితం మనకు నేర్పుతుందని కెఎల్ఆర్ తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు, గౌరవం, అభివృద్ధి అందేలా కృషి చేయడమే సర్వాయి పాపన్నకు నిజమైన నివాళి అని కెఎల్ఆర్ పేర్కొన్నారు.
“సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన ఆశయాలను భావితరాలకు అందించడం మనందరి బాధ్యత” అని అన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *