ఆర్థిక సహాయం అందించిన మాజీ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి
మణికొండ తెలంగాణ కానుక
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద విద్యార్థిని ఉన్నత విద్యకు అండగా నిలిచిన మణికొండ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ కొండకళ్ళ రామకృష్ణారెడ్డి
మణికొండ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యను పూర్తి చేసిన భార్గవి ప్రస్తుతం ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కాలేజీ ఫీజు చెల్లించడం ఇబ్బందిగా మారింది. దీంతో భార్గవి తన విద్యాభ్యాసం కొనసాగించేందుకు ఆర్థిక సహాయం కోరుతూ రామకృష్ణారెడ్డి ని సంప్రదించింది.
విద్యార్థిని పరిస్థితిని తెలుసుకున్న రామకృష్ణారెడ్డి స్పందించి, ఆమె చదువుకు ఆటంకం కలగకుండా కాలేజీ ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ పేద విద్యార్థి చదువుకు దూరం కాకూడదని, విద్యార్థుల ఉన్నత విద్యకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.
