అసమానతల నిర్మూలనతోనే సామాజిక న్యాయం

Spread the love

తాండూర్, తెలంగాణ కానుక

సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను నిర్మూలించడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య అన్నారు. జెన్‌జీ తరం సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
మంగళవారం తాండూర్ కాలేజీ బాలుర హాస్టల్‌లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో “80 ఏళ్లస్వాతంత్ర్యం–సామాజిక న్యాయం” అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కయ్య మాట్లాడుతూ.. దేశంలో కుల వివక్ష, అంటరానితనం ఇంకా కొనసాగడం బాధాక రమన్నారు. దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీల హక్కుల పరిరక్షణకు యువత ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్‌జీ ఉద్యమ స్ఫూర్తితో విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం పోరాడాలని సూచించారు. భూమి, పరిశ్రమలు, ప్రకృతి వనరులపై ప్రజలకు న్యాయమైన వాటా కల్పించినప్పుడే సంపూర్ణ సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప, స్వేరో జిల్లా నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *