ప్రముఖ సామజిక వేత్త నారాయణ స్వామి కన్నుమూతహైదరాబాద్ తెలంగాణ కానుక,

Spread the love

సీనియర్ జర్నలిస్ట్ అమేజింగ్ తెలంగాణా దినపత్రిక ఎడిటర్ పొడిశెట్టి రమేష్ కుమార్ తండ్రి ప్రముఖ సామజిక వేత్త పొడిశెట్టి నారాయణ స్వామి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. అమెరికా లో ప్రసిద్ధి అంకాలజీ డాక్టర్ డాక్టర్ కత్తుల సతీష్ నారాయణ స్వామి కుటుంబాన్ని పరామర్శించారు. నారాయణ స్వామి చిత్ర పటానికి నివాళి అర్పించారు.అనంతరం నారాయణ స్వామి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ సతీష్ ఇంటర్ మీడియట్ వరకు ములుగు లోనే చదువుకున్నానని అయన అన్నారు. తన తండ్రి కత్తుల వెంకటయ్య కు నారాయణ స్వామి మంచి మిత్రుడు అని అయన కొనియాడారు. నారాయణ స్వామి మొదటినించి తన జీవితం ఒక క్రమశిక్షణ తో కూడుకున్నదని అయన పేర్కొన్నారు. అంతే కాకుండా చిన్ననాటి నుండే పిల్లలు క్రమశిక్షణ పొదుపు అవగాహన పెంచే వారాని. సుధాకర్ చిన్న పిల్లల పొదుపు పధకం పేరుతో ఒక పధకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో పిల్లలు వారి వద్ద ఉన్న ఒకరుపాయి రెండు రూపాయలు ఉంటే తన వద్దకు వచ్చి ఇచ్చి ఒక కార్డు లో ఎంట్రీ చేపించు కునే వారిమని అన్నారు.
ములుగు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చింతనిప్పుల బిక్షపతి మాట్లాడుతూ నారాయణ స్వామి నిరాడoబర జీవితం గడుపుతూ తనకు చేతనైనా రీతిలో సమాజానికి సేవ చేయడం ద్వారా స్థానిక ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అని అన్నారు. డాక్టర్ సతీష్
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియాన్స్ అఫ్ ఇండియన్ ఆరిజన్ ఎఎపిపి అధ్యక్షులు గా చాలా సంవత్సరాలు పనిచేశారు. గత నెలలో
డా సతీష్ కు అంతర్జాతీయం గా గుర్తింపు పొందిన హేమాటలాజి, అంకలాజిస్ట్, విద్యావేత్త మరియు ఆరోగ్య రంగ నాయకులు సతీష్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఎ టి ఎ )వార్షిక సదస్సు లో ఎక్షలెన్స్ ఇన్ మెడిసిన్ అవార్డు ఎందుకున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *