ఎస్టి హాస్టల్ ను తనిఖీ చేసిన తహసీల్దార్.

Spread the love

బయ్యారం,తెలంగాణ కానుక,ఆగస్టు 13.

బయ్యారం మండలంలోని జగ్గు తాండ పంచాయతీ పరిధిలో ఎస్టి బాలుర హాస్టల్ ను మండల తహశీల్దార్ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాల పరిశుభ్రత,మౌళిక వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.భోజనం మెనూ ప్రకారం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో ఏమైనా సమస్యలు వస్తే ఫిర్యాదు బాక్సులో ఫిర్యాదు రాసి ఉంచాలని కోరారు.ఇతర కంప్లైంట్ కొరకు బ్యానర్ పై ఉన్న అధికారులు ఫోన్ నెంబర్ కు సమాచారం అందించాలని విద్యార్థులను కోరారు. సీజనల్ వ్యాధులు రాకుండా, ముందస్తు చర్యలు చేపట్టాలని వార్డెన్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి,తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *