ప్రజా బాట బస్తీ బాట లోనేరుగా విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి : మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్,

Spread the love

నార్సింగి తెలంగాణ కానుక

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించడానికి తెలంగాణ విద్యుత్ అధికారులు కృషి చేస్తున్నారని నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ కోట వేణు గౌడ్ అన్నారు. బస్తీ బాటా కార్యక్రమంలో భాగంగా గురువారం నార్సింగి హైట్స్ లోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్ నుండి ముస్లిం శ్మశాన వాటిక వరకు ప్రజల సౌకర్యార్థం ఐదు విద్యుత్ స్తంభాలను విజయవంతంగా షిఫ్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్సింగి లో మౌలిక వసతుల కల్పనకై ప్రత్యేక శ్రద్ధ ఉన్నామని ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నార్సింగి చైర్మన్, కోట వేణు గౌడ్, ఏ.ఈ మణికంఠ , లైన్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ , కాంట్రాక్టర్ శ్రీనాథ్ , లైన్‌మెన్ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *