నార్సింగి తెలంగాణ కానుక
ప్రజా అవసరాలకు అనుగుణంగా దిశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని నార్సింగి వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ కోట వేణు గౌడ్ అన్నారు. నార్సింగి హైట్స్ కాలనీలో శరవేగంగా జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను గురువారం కాలనీవాసులతో కలిసి పరిశీలించిన నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోట వేణు గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోట వేణు గౌడ్ మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమార్ పాల్గొన్నారు.
