మణికొండ తెలంగాణ కానుక
ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రంలోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రవణ్ కుమార్ అన్నారు.బుధవారం ఇందిర మహిళా శక్తి చీరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.వారి ఆర్థిక ప్రగతితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దే శ్యంతో పథకాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు.మహిళల సంక్షేమం,ఆర్థిక స్వావలంబన మరియు సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
