మణికొండలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

Spread the love

మణికొండ తెలంగాణ కానుక

మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాజీ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మణికొండ డివిజన్ పరిధిలో డ్వాక్రా మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ కె. రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు,
ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇందిరమ్మ చీరలను అందుకున్నారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో మణికొండ మాజీ సర్పంచ్ యాలాల నరేష్ , మాజీ కౌన్సిలర్ యాలాల లావణ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బషీర్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎర్పుల కుమార్ , లక్ష్మశ్రీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రవణ్ కుమార్ , పుల్లారావు మణికొండ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సావిత్రి , ఏ-బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *