నార్సింగి తెలంగాణ కానుక
నార్సింగి సర్కిల్ పరిధిలో పలు సమస్యలతో పాటు అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ ను కోరిన గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ బుధవారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ మలెంపాటి, ఐ.ఏ.ఎస్. ను మర్యాదపూర్వకంగా కలిసి, నార్సింగి సర్కిల్ పరిధిలోని అన్ని వార్డుల మౌలిక వసతుల కల్పన సమగ్ర అభివృద్ధి, పెండింగ్ పనులు వెంటనే చేపట్టాలని వినతి పత్రాన్ని అందజేసిన తలారి మల్లేష్ ముదిరాజ్ ఈ సందర్భంగా రహదారులు, డ్రైనేజ్, తాగునీటి సౌకర్యాలు, వీధి దీపాలు, పారిశుధ్యం, పార్కులు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి మెరుగైన పౌరసేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ కోట వేణు గౌడ్ , గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తల్లారి మల్లేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు.
