బండ్లగూడ తెలంగాణ కానుక
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించడమే లక్ష్యమని భీమార్జున్ రెడ్డి అన్నారు.భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 9 నుండి 17 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళ పై జాతీయ జెండాను గర్వంగా ఎగరవేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు దేశభక్తి చాటే విధంగా కిస్మత్పూర్ లోని బీజేపీ రాష్ట్ర కన్వీనర్ అన్నపురెడ్డి భీమార్జునురెడ్డి రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి అన్నప్ రెడ్డి స్వర్ణలత రెడ్డి దంపతులు తమ ఇంటి పైన జాతీయ పథకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం కోసం పోరాటాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో దేశం పట్ల జాతీయ జెండా పట్ల గౌరవం దేశభక్తి భావనను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
