మణికొండ తెలంగాణ కానుక
రక్తమైసమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో తన ఇంటి నుంచి బోనం వడిబియ్యం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కు తీర్చుకున్న నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మి శ్రీ ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, మాజీ కౌన్సిలర్ లు రామకృష్ణారెడ్డి,శైలజ , కిరణ్ కాంగ్రెస్ నాయకులు కపిల్ , ఏసీపీ శరత్, దేవేందర్ రెడ్డి , అశోక్ యాదవ్ , మణికొండ మాజీ వినోద్ ,శ్రవణ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
