ఘనంగా మన్నె వెంకటేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు,

Spread the love

శంకర్ పల్లి తెలంగాణ కానుక

శంకర్‌పల్లి మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన్నె వెంకట్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు మిత్రులు శ్రేయోభిలాషుల తో కలిసి ఘనంగా జరుపుకున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మోకిలా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు విద్య సామాగ్రి జైమెట్రీ బాక్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు తన జన్మదిన సందర్భంగా ఎంతోకొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో వారు చదువుకోవడానికి ఉపయోగపడే విద్యా సామాగ్రి అందించడం జరిగిందని అన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తన జన్మదిన సందర్భంగా సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

అంతకుముందు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ని, మెదక్ కంటెస్టెడ్ ఎంపీ నీలం మధు ముదిరాజ్ ని, రంగారెడ్డి జిల్లా గంధాలయ సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది అని మన్నె వెంకట్ తెలిపారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *