పేద విద్యార్థులకు విద్యను చేరువ చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి :

Spread the love

నార్సింగి తెలంగాణ కానుక

పేద విద్యార్థులకు విద్యను చేరువ చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ కోరారు. మంగళవారం గోల్కొండ రిపార్డ్స్ గండిపేట సంస్థ సహకారంతో విద్యార్థులకు బ్యాగులు రాత పుస్తకాలు పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తలారి మల్లేష్ ముదిరాజ్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఖానాపూర్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, రాతపుస్తకాలు స్టేషనరీని అందజేశారు. ఈ సందర్భంగా తలారి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు రిసార్ట్స్ తరుపున విద్యా సహాయం అందించడం అభినందనీయమని అన్నారు. ఖానాపూర్ మాజీ సర్పంచ్ రామేశ్వరం నర్సింహా మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పెద్దపులి కిషన్ కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలు ప్రధానో పాధ్యాయులు ఆలంపల్లి మధుకర్ రెడ్డి ఉపాఠాయాలు పద్మజ, భోగ్యమ్మ, మంజుల, మాధవి, శివరాంరెడ్డి రంగార, తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *