రాజేంద్రనగర్ జోనల్ టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ గా సాంబయ్య,

Spread the love

జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ నగర్ జోనల్ టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ గా సాంబయ్య నియమితులయ్యారు. ఈ మెరకు ఆయన మంగళవారం చార్జ్ తీసుకున్నారు. ఇంతకు ముందు గోల్కొండ జోనల్ సిపిగా విధులు నిర్వహిస్తున్న ఈయనకు వారం రోజుల క్రితమె రాజేంద్రనగర్ జోనల్ కు బదిలీ చేశారు. కాగా ఎస్ ఐ ఆర్ కారణంగా ఈ నెల 10 వరకు ఎక్కడి వాళ్ళు అక్కడే విధులు నిర్వహించాలని కమీషనర్ ఆదేశించారు. దీంతో బదిలీలు జరిగిన అధికారులు ఎస్ ఐ ఆర్ కారణంగా పోస్టింగ్ తీసుకోలేదు. సోమవారం తో ఎస్ ఐ ఆర్ ముగియటంతో బదిలీలు జరిగిన టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం పోస్టింగ్ తీసుకున్నారు. ఇందులో బాగంగానే సాంబయ్య జోనల్ కమీషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డిని కలిసి రాజేంద్రనగర్ జోనల్ సిపి గా చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సీసీ సాంబయ్య మాట్లాడుతూ ప్లానింగ్ ప్రకారమే ఇళ్ళ నిర్మాణం చేపట్టేలా నిర్మాణ దారులలో అవేర్ నెస్ వచ్చేలా కృషి చేస్తామని అన్నారు.అనుమతులకు విరుధ్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని అన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *